Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి
- ఈ నెల 14 నుంచి మండలంలో ప్రగతి నివేదన పాదయాత్ర
- ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ మండల కార్యవర్గ సమావేశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
బీఆర్ఎస్ విధివిధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల బీఆర్ ఎస్ అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అమల వుతున్న సంక్షేమ పథకాల విజయగాథాలపై ప్రజలు దృష్టి సారించడాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు జీర్ణించు కోలేకపోతున్నారని విమర్శించారు. విపక్ష నాయ కుల వద్ద సరుకులేదని, అందుకే వ్యక్తిగత దూషణలకు దిగుతు న్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించడానికి దమ్ములేక తిట్టడమే రాజకీయమన్నట్లుగా వ్యవహరి స్తున్నారని దుయ్యబట్టారు. రోడ్లు, కరెంట్, పింఛన్లు, జీతాలు గ్రామాలు, పట్టణాలు, గ్రీనరీ వ్యవసాయం, ప్రాజెక్టులు, తాగునీరు తదితర అంశాలపై చర్చించడం మానేసి ప్రతిపక్ష నేతలు కూల్చడాలు, పడగొట్టడాలపై దృష్టి సారించారని దుమ్మొత్తిపోశారు. సిద్ధాంతపరమైన పార్టీలుగా చెప్పుకునే వారు వాటిని వదిలేసి పసలేని రాద్ధాంతాలపై యాగీ చేస్తున్నారన్నారు. కేసిఆర్ సారధ్యంలో జరిగిన అభివద్ధి, సంక్షేమన్ని గడపగడపకు వివరించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రగతి నివేదన యాత్ర జరుగుతున్నదని అన్నారు. ఈ నెల 14 నుంచి పది రోజుల పాటు మండలంలో జరిగే ప్రశాంత్ రెడ్డి పాదయాత్రలో పార్టీ శ్రేణులు, అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల్లో పని చేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డిని విమర్శించే వారు మరోమారు ప్రజల చీత్కారానికి గురికాక తప్పదన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కృపేష్, వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షులు గణేష్, జగన్నాథం, నర్సింహ, సింగిల్ విండో చైర్మన్లు వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు భాస్కర్‌గౌడ్, గీతా రాంరెడ్డి, సిద్దాల జ్యోతి, పవిత్ర కుమార్, యాదగిరి, హంసమ్మ, ఎంపీటీసీలు మంగా రవీందర్, అచ్చన శ్రీశైలం, నాగమణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.