Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు లచ్చిరెడ్డి
- గ్రామస్థాయి నుంచే ధరణిపై ప్రక్షాళన జరగాలి :
- నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్
- యాచారంలో భూ న్యాయ శిబిరంపై అవగాహనా సదస్సు
- పాల్గొన్న వివిధ గ్రామాల రైతులు
- భూ సమస్యలపై సలహాలు, సూచనలు
- సీసీఎల్‌లో 17 లక్షల భూ పెండింగ్ దరఖాస్తులు
నవతెలంగాణ-యాచారం
ధరణి వైబ్సైట్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుందని రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు లచ్చిరెడ్డి అన్నారు. శనివారం యాచారం గ్రామంలోని 'మన గ్రామంలో భూ న్యాయ శిబిరం'తో లీప్స్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆర్గనైజర్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన రైతులకు సలహాలు, సూచనలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూ సమస్యలు పరిష్కారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణిని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఆ ధరణిపై గ్రామస్థాయి నుంచి నమ్మకం కోల్పోయి భూ సమస్యల సుడిగుండంగా మారిందని వెల్లడించారు. మ్యుటేషన్ పేరుతో మీసేవా కేంద్రాలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యుటేషన్ చేసినా కూడా రెవెన్యూ అధికారులు ఆ ఫైల్‌ను రిజెక్ట్ చేస్తున్నారని విమర్శించారు. రైతులు పే చేసిన డబ్బులు రికవరీ కావడంలేదన్నారు. ధరణి వైబ్‌సైట్స్ ప్రారంభమైన తర్వాత కొన్ని వేల ఎకరాల భూమి కబ్జాదారుల్లోకి వెళ్లి మాయం చేశారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలలో అనేక భూ సమస్యలతో రైతులంతా సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు వచ్చిన సమస్య గురించి అవగాహన లేక ఎవరిని సంప్రదించాలో వారికి తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
గ్రామస్థాయి నుంచి ధరణిపై ప్రక్షాళన జరగాలని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ అన్నారు. ధరణిలో వివిధ రకాల భూ సమస్యలు లక్షల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.ఈ వెబ్‌సైట్స్ ద్వారా బాధిత రైతులకు స్పష్టమైన విధానం దొరకడం లేదన్నారు. ఈ ధరణి వైబ్‌సైట్స్ రాకముందు గ్రామస్థాయిలోనే రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యేవని గుర్తు చేశారు. ధరణి పోర్టల్ అనేది ఒక దుర్భరమైన ఆన్లైన్ వెబ్‌సైట్స్ అన్ని విమర్శించారు. సాదా బైనమాల పేరుతో రైతులంతా మీసేవా సెంటర్ల చుట్టూ తిరుగుతూ నిలువు దోపిడీకి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతుకు భూమిపైన సమస్య వచ్చిందంటే ఎవరిని కలవాలో, ఏ దారిలో వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ప్రతిష్టమైన రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ఒక వ్యవస్థను రూపొంధించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ కిసాన్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, కాంగ్రెస్ కిషాన్ రాష్ట్ర అధ్యక్షులు అవినాష్ రెడ్డి, నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, మర్రి నిరంజన్ రెడ్డి, దండెం రామిరెడ్డి, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.