Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి గ్రామ పంచాయతీ కార్మికుల పాదయాత్రను విజయవంతం చేయాలి
- జీపీ యూనియన్రాష్ట్ర కార్యదర్శి గ్యార పాండు, సీఐటీయూ మండల కన్వీనర్ పోచమని కృష్ణ
నవతెలంగాణ-మంచాల
గ్రామ పంచాయతీ కార్మికుల మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గ్యార పాండు, సీఐ టీయూ మండల కన్వీనర్ పోచమొని కృష్ణ అన్నారు. శనివారం మండల పరిధి లోని ఆరుట్ల గ్రామంలో పాదయాత్ర వాల్పోస్టర్ ఆవిష్క రించారు. అనంతరం వారు మాట్లాడుతూ జీపీ కార్మికులకు కనీస వేతనం రూ. 24 వేలు ఇవ్వాలన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మికుల చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడులుగా ప్రవేశపెట్టిందని దుయ్యబట్టారు. జీవో 51 తెచ్చి, 500 జనాభాకు ఒకొక్క కార్మికునికి రూ.8500 చొప్పున వేతనాలు నిర్ణయించిందన్నారు.ఈ సమస్యల పరిష్కారానికి నేడు పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు.ఈ యాత్రను జయపద్రం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాల్గొన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవి, అర్జున్, శ్రీను, లక్ష్మయ్య ఉన్నారు.