Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహేశ్వరం
కేసుల పరిష్కారంలో రాజీ మార్గమే రాజా మార్గమని మహేశ్వరం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఫరీన్ కౌసర్ అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్లో భాగంగా మహేశ్వరం సివిల్ కోర్టు ఆవరణలో మహేశ్వరం, కందుకూరు మండలాల పరిధిలోని పెండింగ్లో ఉన్న 1697 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న భూమి ఇతర సమస్యలు పరిష్కరించుకునేందుకు ,సమయం వృథా చేయకుండా రాజామార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం, కందుకూరు సీఐలు మధు సూధన్, కృష్ణంరాజు మహేశ్వరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరికిషన్గౌడ్, సీనియర్ న్యాయవాదులు అశోక్, సుబాష్ చంద్రారెడ్డి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.