Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-మంచాల
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని జపాల్ గ్రామంలో ప్రగతి నివేదన యాత్ర 21 వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జపాల్ గ్రామ, సంక్షేమ, అభివృద్ధి కోసం రూ.8.36 కోట్లు ఖర్చు చేయడం జరిగిందనీ, త్వరలోనే ఆగపల్లి నుంచి జపాల మీదుగా మంచాల వరకూ డబుల్ రోడ్డు నిర్మిచనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మన ఊరి మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించినట్టు వెల్లడించారు. ప్రగతి నివేదన యాత్ర సందర్భంగా సీసీరోడ్డు, అండర్ డ్రయినేజీ నిర్మాణ పనుల కోసం రూ. 5 లక్షలు, 80 ఎల్ ఈడీ లైట్లు ఎమ్మెల్యే మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రతి నెలా పింఛన్లు రూ.6.44 లక్షలు,రైతుబంధు రూ.64.65 లక్షలు, రైతు బీమా రూ. 10.69 లక్షలు, కల్యణలక్ష్మి, షాదిముబార్ రూ. 57.88 కోట్లు, కేసీఆర్ కిట్ ద్వారా రూ. 17.55 లక్షలు మంజూరైనట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, మండలాధ్యక్షులు చీరాల రమేష్, ఎంపీపీ జాటొత్ నర్మదాలచ్చిరాం, మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బహదూర్, జిల్లా నాయకులు బియ్యని జ్ఞానేశ్వర్, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ రవి, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ మొద్దు సికిందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నర్సింగ్ వెంకటేష్ గౌడ్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మాజీ చైర్మెన్ కంబాలపల్లి భరత్ కుమార్, జపాల ఉపసర్పంచ్ బకున మల్లప్ప, గ్రామాధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, హనుమండ్ల సంజీవ, సర్పంచ్‌లు అనిరెడ్డి జగన్‌రెడ్డి, పి. అండాలు వెంకటేష్, కుకు డాల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు పేసరి గాయాల సుకన్య శేకర్ రెడ్డి, నర్సింగ్ అనిత వెంకటేష్ గౌడ్, యువజన విభాగం మండలాధ్యక్షులు బద్రీనాథ్ గుప్త, విజరు, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు ప్రభాకర్, విద్యార్థి విభాగం మండల అధ్యక్ష,కార్యదర్శులు అంగోతు ప్రవీణ్ నాయక్ ఉన్నారు.