Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ చేవెళ్ళ నియోజకవర్గ సీనియర్ నాయకులు సున్నపు వసంతం
- చేవెళ్ళలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ
- అనంతరం దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-చేవెళ్ల
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని చట్టబద్ధంగా శిక్షించాలని కాంగ్రెస్ చేవెళ్ళ నియోజకవర్గ సీనియర్ నాయకులు సున్నపు వసంతం డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేవెళ్ళ మండల కేంద్రంలో నిరసన, ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముక్తకంఠంతో ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించాలనీ, వెంటనే అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ ప్రపంచ మేధావి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను దేశద్రోహిగా గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక, సామాజిక , రాజకీయ సమానత్వం కోసం శ్రమించి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంతో గొప్పదని, ప్రపంచ దేశాలకు ఆదర్శమన్నారు. రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి, తప్పుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వాలు స్పందించి, ఇలాంటి వ్యక్తులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపీపీ విజయలక్ష్మీ రమణారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జనార్ధన్ రెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు కె. రామస్వామి, ఎం.ప్రభులింగం, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాలా ప్రభాకర్, సీపీఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజు, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, చేవెళ్ళ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సున్నపు ప్రవీణ్, ప్రజా హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు కడమంచి ఆనంద్, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పామేన సర్పంచ్, ఉపసర్పంచ్లు మల్లారెడ్డి, విజరు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.