Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ మత విధ్వేషాన్ని రెచ్చగొట్టే కుట్రను తిప్పికొట్టాలి
- మాజీ మంత్రి ప్రసాద్ కుమార్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలందరూ ఆశీర్వ దించాలని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామంలో 'హత్ సే హత్ జోడో' అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో బాబా సాహెబ్ అంబేద్కర్, జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి, కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కళా సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అసైన్మెంట్ భూములకు క్రయవిక్రయ హక్కులు కల్పిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పనులు భారాలు పెంచి, బడా కార్పొరేట్ బడా బాబులకు దోచిపెడుతున్నాయని దుయ్య బట్టారు. బీజేపీ మతాల పేరుతో దేశాన్ని విధ్వంసం చేసే కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ రాష్ట్రాన్ని అదొగతి పాలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజా వ్యతి రేక విధానాలు అవలంభిస్తన్న కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలకు ప్రజలు గట్టి బుద్దిచెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ, మహి పాల్ రెడ్డి, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, కమల్ రెడ్డి, ఎంపీ టీసీ అనసూజా, పార్టీ మండల అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, అనంత్ రెడ్డి, జాఫర్, రఘుపతి రెడ్డి, శివయ్య, మనోహర్ గౌడ్, అయూబ్ అన్సారీ, జంగయ్య, బస్వారాజ్, హన్మంత్, శ్రీనివాస్ ముదిరాజ్, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.