Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ నాయక్
నవతెలంగాణ-షాద్ నగర్
షాద్నగర్ అభివృద్ధికి అందరూ సహకరించాలని, రోడ్డు విస్తరణ జరిగితే అభివృద్ధి కూడా జరుగుతుందని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ నాయక్ అన్నారు. షాద్నగర్లో జరుగు తున్న రోడ్డు విస్తరణ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ నాయక్ మాట్లాడుతూ పట్టణంలోని ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పరిగి రోడ్డులో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు విద్యుత్ శాఖ కార్యాలయం సమీపం లో యూటర్న్ ఏర్పాటు చేసే విధం గా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. అదే విధంగా జడ్చర్ల, హైదరాబాద్ రోడ్లలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్లోని రోడ్డు గుంతలను పుడ్చాలని ఆర్అండ్బీ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, షాద్నగర్ ఏసీపీ కుశల్కర్, సీఐ నవీన్ కుమార్, ట్రాఫిక్ సీఐ శ్రీశైలం యాదవ్, ఆర్అండ్బీ డిఈ రవీందర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకన్నబాబు, మున్సిపల్ చైర్మన్ నరేందర్ పాల్గొన్నారు.