Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ఆసోసిట్ ప్రొఫెసర్ చెన్న దోరై
నవతెలంగాణ-దోమ
గ్రామ పంచాయతీలు ఆదాయ వనరులు పెంచుకోవాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ డెవలప్ మెంట్ అసోసిట్ ప్రొఫెసర్ చిన్నదోరై పేర్కొన్నట్టు దోమ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కె.రాజిరెడ్డి తెలిపారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ శిక్షణ భవనంలో వికారాబాద్ రంగారెడ్డి మేడ్చెల్ జిల్లాల నుంచి నలుగురు చొప్పున సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రొఫేసర్ చిన్నదోరై మాట్లాడుతూ సర్పంచుల సమస్యలు వింటూనే సొంత ఆదాయ వనరులు సమాకుర్చుకుంటే, సమస్యలు ఉండవన్నారున. 2018 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ లకు వసులు అయ్యే పన్నులు రూ.234 కోట్లు ఉంటే, 2021 వరకు రూ.11 వందల కోట్లపై చిలుకు పన్నులు పంచాయతీలు వసులు చేశాయని వివరించారు. ప్రజలకు వసతుల కల్పనలో సర్పంచ్‌లు, కార్యదర్శులు కలిసి సమీష్టిగా పనులు చేస్తే, పన్నులు వసులు చేయాలని సూచించారు.అంతేకాకుండా పంచా యతీ బాడీ తీర్మాణాలతో పన్నుల వసులు పెంచుకోవచ్చన్నారు.ఈ శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్ సీఈఓ రాఘవేంద్రరావు మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్‌ను ప్రకారం ఇంటి పన్నులు పెంచి కాళీ స్థలాలను కూడా మేజర్మెంట్ చేసి, ఆన్లైన్ చేస్తే ఆటోమెటిక్‌గా రుసుములు పెరుగుతాయని తద్వారా వారి జాగలకు భద్రత ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు.ఖాళీ జాగాల విషయంలో ఏం చేయాలని సర్పంచ్‌లు అడిగిగా, ఆయన స్పందించి మాట్లాడుతూ ఖాళి స్థలాలు రికార్డు చేసి, ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ టవర్ల పన్నులు వేసి, వసులు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం నాయకులు లక్ష్మినర్సింహా రెడ్డి, శ్రీధర్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.