Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ గడీలు బద్దలు కొట్టేది బీజేపీ
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు
నవతెలంగాణ-పరిగి
సీఎం కేసీఆర్ మోసగాళ్లకే మోసగాడని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు అన్నారు. గురువారం పరిగి మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట్ గ్రామంలో ప్రజా గోస-బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా పరిగి పట్టణ కేంద్రంలోని బీజేపీ కార్యాలయం ముందు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల్ని, రైతులను మోసం చేశారని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అన్నాడు కానీ గ్రామంలో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి నేటికీ పనులు ప్రారంభించలేదని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని, ఏకకాలంలో రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, రైతులకు ఉచితంగా యూరియా ఇస్తానని ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా మారి రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మండిపడ్డారు. ఇక్కడ చెల్లని రూపాయి ఎక్కడ చెల్లదని ఎద్దేవా చేశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. కేంద్రం నుంచి అభివృద్ధి ఫలాలు ఇస్తానంటే సీఎం కేసీఆర్ సహకరించడం లేదని అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం చేసిందేనని గుర్తు చేశారు. పరిగి ప్రాంతాల్లో సరైన రోడ్లు లేవని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు తెలుసుకో వడానికి ప్రజా గోస- బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 11వేల సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 1,900 సమావేశాలు పూర్తి అయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్కి గడి బద్దలు కొట్టేది బీజేపీ అని అన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేసి సీఎం అయ్యాడని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంలో డబ్బులు కుమ్మరించి కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని అన్నారు. దేశం బాగుపడాలంటే రాష్ట్రం గ్రామాలు బాగుప డాలని నరేంద్ర మోడీ గ్రామాల అభివృద్ధికి డబ్బులు ఇస్తే వాటిని సీఎం కేసీఆర్ దొంగతనం చేశాడని విమర్శించారు. బీజేపీ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిం చారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను మభ్య పెట్టారని అన్నారు. దళిత బంధు ఇస్తానని చెప్పి ప్రజలకు ఇవ్వకుండా మభ్యపెడుతు న్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, పరిగి నియోజకవర్గ నాయ కులు మిట్ట పరమేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్, రూప్ఖా న్పెట్ సర్పంచ్ నర్సింలు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షు డు కిరణ్, జిల్లా కార్యదర్శి పెంటయ్య, ఉపాధ్యక్షుడు రామ చందర్, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, రూప్‌ఖాన్ పెట్ శక్తి కేంద్రం ఇన్చార్జి శ్యాంసుందర్, పోలింగ్ బూత్ అధ్యక్షులు శ్రీనివాస్, యాదయ్య, శివకుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.