Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగం అభివృద్ధే ప్రధాన లక్ష్యం
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి
నవతెలంగాణ-కొడంగల్
నిబద్ధత, నిజాయితీ ఉన్న నాయకుడు పాపన్నగారి మాణిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని టీఎస్‌యూటీ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి అన్నారు. గురువారం కోడం గల్, దౌల్తాబాద్ మండలాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయ సమస్యల పట్ల అవగా హన ఉన్న వారిని ఎన్నుకుంటే సమస్యలపై అవగాహన ఉంటుందన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం ఉంటుం దన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఏ ఒక సమస్య పరిష్కారం కాలేద న్నారు. వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నా రు. అలకేషన్ పేరుతో ఖాళీలను అలాగే ఉంచి ఉపాధ్యా యులను మెడబట్టి గెంటివేసినట్టు చేశారన్నారు. 317 జీవో రావడానికి కారణం ఏ ఉపాధ్యాయ సంఘంతో మా ట్లాడి జీవో తీసుకువచ్చారని, ఉపాధ్యాయులు ఎదుర్కొం టున్న సమస్యల గురించి ఆ సంఘం వారిని ప్రశ్నించాల న్నారు. జిల్లాల విభజన తర్వాత ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చామన్నారు. 317 జీవో వ్యతిరేకిస్తూ సచివాలయం ముట్టడిస్తే కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న తర్వాత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఏ విధంగా దొరుకుతుందన్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు బలంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇంక్రిమెంట్, పే స్కేల్ సాధించామంటే గతంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట ఫలితమే అన్నారు. స్థానికులకు స్థానికంగా అవకా శం కల్పించాలని పోరాటం చేయాల్సిన అవసరం ఉంద న్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడుతున్నారని అన్నారు. మిగతా ఇద్దరు ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదో ఆలోచించాలన్నారు. 317 బాధితులకు ఏం న్యాయం చేశారని జీవో అమలు చేసిన రోజు ప్రభుత్వంతో కూర్చుని చర్చించిన ఉపాధ్యాయ సంఘాన్ని ప్రశ్నించాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై పనిచేసి వారికి ఓటు వేయాలని ఉపాధ్యాయులను కోరారు, ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రాములు, మండల అధ్యక్షులు బసప్ప, కార్యదర్శి అశోక్, బొంరాస్‌పేట్ కార్యదర్శి గోపాల్, జిల్లా కార్యదర్శి మల్లేష్, సభ్యులు నర్సింగ్, అంజినాయక్, భీమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.