Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్బెడ్రూం, పోడు పట్టాల సమస్యలను పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీసీ
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసా గుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంటివెలుగు, డబుల్ బెడ్రూం, పోడు పట్టాలు, తెలంగాణకు హరితహారంపై జిల్లా కలెక్టర్లతో ఆమె వీసీ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగు తుందని తెలిపారు. ఇప్పటి వరకు లక్ష, 90 వేల 579 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు. 36,372 మందికి రీడింగ్ కండ్ల అద్దాలు అందించినట్టు తెలిపారు. 31,777 ప్రీస్క్రీప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లకు 8,979 దరఖాస్తులు అందాయని, ఇందులో 3,086 మంది అర్హత కలిగి ఉన్నారని తెలిపారు. 2,341 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి అయి లబ్దిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్న ట్టు తెలిపారు. హరితహారంలో భాగంగా వచ్చే ఏడాది నాటే మొక్కలను నర్సరీలలో పెంచుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో నాటిన మొక్కలను సంరక్షిస్తున్నా మని తెలిపారు. మార్చి 31వ తేదీ వరకు జిల్లాలో పన్నులు వంద శాతం వసూలు చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వేంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.