Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో వేదాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణోత్సవానికి ఆలయ నిర్వాహకులు విశాల వసతులు, భక్తుల సౌకర్యం చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా స్వామివారికి వార్షిక బ్రహ్మౌత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయ వార్షిక బ్రహ్మౌత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవానికి ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలు పుష్పలతో, పచ్చటి తోరణాలతో అందంగా అలంకరించారు. లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలు ధరించి మంటపానికి తీసుకొ చ్చారు. వేద పండితులు మంత్రోచ్ఛరణలతో మంగళ వాయిద్యాలతో ఆలయ ధర్మకర్త ,శ్రీనివాసమూర్తి, నరసింహ శాస్త్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా జరిపించారు. ఈ కల్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యా దవ్, జడ్పీ చైర్మన్ తీగల అనిత రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, జడ్పీ కోప్షన్ ముజుబుర్రహ్మాన్, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, వైసీపీ తాలూకా ఇన్చార్జి చీమర్ల అర్జున్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. రూ.30లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. అనంతరం జడ్పీ చైర్మన్ తీగల అనితా రెడ్డి మాట్లాడుతూ జడ్పీ నిదుల నుంచి దేవాలయ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి తనవంతుగా రూ.ఐదు లక్షలు, జడ్పీటీసీలు నిధులు రూ.ఐదు లక్షలు అందజేసినట్టు తెలిపారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవెందర్రెడ్డి మా ట్లాడుతూ కల్యాణానికి హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులను ఘనంగా సన్మానించారు. శతాబ్ది టౌన్షిప్ అధినేత శ్రీనివాస్‌రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగీత శ్రీనివాస్‌యాదవ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ అంబాజీ, సింగల్ విండో వైస్ చైర్మన్ కూన రవికుమార్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు గోపాల్ నాయ క్, ఖానాపూర్ ఎంపీటీసీ గార్లపాటి సరిత గణేష్ గుప్తా, చౌదర్ పల్లి సర్పంచ్ చంద్రయ్య, ఉపసర్పంచ్ అజిజ్, తదితరులు పాల్గొన్నారు.