Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్ అన్నారు. హైదర్గూడ సెక్టా ర్కు సంబంధించిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, టీఆర్ఎస్ కె.వి యూనియన్ నుంచి సీఐటీయూలో చేరా రు. గండిపేట అధ్యక్షురాలు సుధారాణి, సీఐటీయూ రం గారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్ర కుమార్, కమిటీ సభ్యులు జి కురుమయ్య. రాజేంద్రనగర్ మండల కన్వీనర్ జి గట్టయ్య ఆధ్వర్యంలో సీఐటీయూలో చేరారు. ఈ సం దర్భంగా రుద్రకుమార్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలనికొంతకాలంగా శాంతియుతం గా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్లో ఏర్పాటు చేసిన ఐసీడీఎస్ ఆఫీసులో మ హిళలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని అన్నారు. ఈ విషయమై గతంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి దృష్టికి తీసుకెళ్లినా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదని తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్లో చాలా అంగన్వాడీలు అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. వెంటనే శాశ్వత భవనాలు నిర్మాణా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం హైదర్గూడ అంగన్వాడీ వర్కర్స్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్య క్షురాలుగా ఇందిరా, కార్యదర్శిగా షమీంబేగం, కోశాధికారిగా అనితలను ఎన్నుకున్నారు.