Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా నాయకులు కె.రామస్వామి
- మూడోవ రోజుకు చేరుకున్న సీపీఐ భూపోరాటం
నవతెలంగాణ-చేవెళ్ల
ప్రతి పేదవాడికి పట్టాలు ఇచ్చేవరకూ సీపీఐ పోరాడుతోందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. రామస్వామి అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటం మూడోవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన గుడిసే పోరా టాన్ని సందర్శించారు. అనంతరం రామ స్వామి మాట్లాడుతూ గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవాడికీ పట్టాలిచ్చే వరకూ సీపీఐ పోరాడుతోందన్నారు. భూ కబ్జా దారులు, ధనవంతులు ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా అనుభవిస్తుంటే ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పేదవాళ్లు 60 గజాల స్థలా న్ని ఇవ్వాలని ప్రభుత్వానికి పలు సందర్భాలలో వినతులు అందజేసినా పట్టించుకోకపోవడంతో పేదలు విసిగి చెంది సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటాలకు సిద్ధమైనట్టు తెలిపారు. పేదవాడికి గుడిసె స్థలం ఇచ్చే వరకు సీపీఐ భూ పోరా టాలు చేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కేసులు పెట్టినా,భయపడబోమని తెలిపారు. ఇప్పటికనా నిరుపేదలందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తా మన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్య నారాయణ, ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్‌గౌడ్, బీకే ఎంయూ జిల్లా అధ్యక్షులు జే.అంజయ్య, మండల సహాయ కార్యదర్శి మక్బూల్, మల్లేష్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, మాధవి, విజయమ్మ, అనసూయ, సాయిలమ్మ తదితరులు పాల్గొన్నారు.