Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని ఇంద్రారెడ్డి నగర్ వార్డు సభ్యులు వై. ప్రవీణ్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని మిర్జాగూడ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డినగర్‌లో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామాల్లోని ప్రజలందరూ పాల్గొన్ని కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ పరీక్షలు చేయించుకున్న వారికి వారి రిపోర్ట్ ప్రకారం కండ్ల అంద్దాలు, మందులు వైద్యులు అందిస్తున్నట్టు తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సహాయ సహకారాలతో మిర్జాగూడ గ్రామ సర్పంచ్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో అండర్ డ్రయినేజీ, సీసీరోడ్లు నిర్మాణ పనులతో పాటు కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వై. చిట్టెమ్మ, శారద, కమలమ్మ,డాక్టర్ ప్రశాంతి, ఎంపీహెచ్ఏ సుహాసీని, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఆప్టికల్ మిక్, ఆశా వర్కర్లు, కాలనీవాసులు ఎల్బీ రెడ్డి, జి.నర్సమ్మ, రాపెన్ పెంటయ్య, లక్ష్మి కళ, గోపాల్‌నాయక్, డి.ఈశ్వరయ్య, కొండూర్ సామి, బత్తుల పాల్గొన్నారు.