Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీపీ పార్మేషన్ నిధులతో రోడ్డు నిర్మాణ పనులు
- బీఆర్ఎస్ మండలాధ్యక్షులు శ్రీనివాస్
నవతెలంగాణ-పెద్దేముల్
రైతుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్టు ఆ పార్టీ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం పెద్దేముల్ కేంద్రం సమీపంలోని చాకలి విఠల్ పొలం వద్ద నుంచి హనుమాన్ ఆలయం గుడి వరకూ, సీడీపీ పార్మేషన్ రూ.5 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హయంలోనే
రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్‌కే దక్కుతోందన్నారు. తాండూరు ప్రాంతంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవతో గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయన్నారు.దశలవారీగా మండలా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్ రంగయ్య, బీఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి బంగ్లా రఘు, గ్రామ కమిటీ అధ్యక్షులు డీవై. ప్రసాద్, ప్రధాన కార్యదర్శిలు మామిండ్ల వెంకటయ్య, బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సింలు గౌడ్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.