Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుల్కచర్ల
మొక్కల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండలంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ పరిధిలో ఉన్న యువకులు యువజన సంఘాలు ప్రజలు బాధ్యతగా మొక్కలను పెంచి వాటిని సంరక్షించడంతో మానవాళికి అవసరమైన ఆక్సిజన్‌ను పొందుతామని ఆయన తెలిపారు.