Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చౌడాపూర్
చౌడాపూర్ మండలం చాకల్‌పల్లి గ్రామం లో పంటలను వ్యవసాయ అధికారి లక్ష్మి కుమారి పరిశీలించారు. అనంతరం ఆన్లైన్ నమోదు ప్రకారం రైతులు పంటలు వేశారో లేదో పరిశీలిం చారు. రైతులకు వరి పంటపై వచ్చే తెగుళ్లు గురించి సూచనలను తెలిపారు. వేరుశనగకు ఎక్కువ ధర ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకోవాలని తూకాలు సరిచూసుకోవాలని రైతులకు సూచిం చారు. ప్రతి రైతూ పీఎం కిసాన్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి భావన, రైతులు, తదితరులు పాల్గొన్నారు.