Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి నందీశ్వరాలయ
- 3 రోజులపాటు జాతర
- సర్పంచ్ ఆధ్వర్యంలో సిద్దేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం
- ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు
నవతెలంగాణ-యాచారం
శివరాత్రి మహౌత్సవాలకు యాచారం మం డల పరిధిలోని నంది వనపర్తిలో వెలసిన శైవ క్షేత్రం శ్రీ నందీశ్వర ఆలయం ముస్తాభైంది. మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయ ధర్మకర్త పళ్ళ సావిత్రి ఆధ్వర్యంలో శివరాత్రి జాతర ఉత్సవాలు నేటి నుంచి మూడ్రోజుపాటు జరుగుతాయని ఆలయ పూజారి వివరించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసాలు ఉండేవారు సాయంత్రం వేళల్లో శ్రీ నందీశ్వరాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటా రు. వీరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మహాశివ రాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 18వ తేదీన శ్రీ నందీశ్వర ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అఖండ దీపారాధన, గణపతి పూజ, కలశ స్థాపన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయాన్ని తీర్చిదిద్దారు. సాయంత్రం వేళల్లో శివునికి అఖండ దీపారాధన, గణపతి పూజ, ధ్వజారోహణం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, జాగారం, లింగార్చన, భక్తుల జాగరణ చేస్తారు. 19వ తేదీన ఆలయంలో శివపార్వతుల కళ్యాణం, 20వ తేదీన ఉదయం రథోత్సవం, పార్వతి దేవికి కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. వీటి కోసం నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సిద్దేశ్వర ఆలయంలో
శివపార్వతుల కల్యాణం
నంది వనపర్తిలో వెలసిన సిద్దేశ్వర ఆలయంలో మహాశివ రాత్రి పురస్కరించుకొని శివపార్వ తుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. సందర్శ కులకు ఎలాంటి అసౌకర్యం కలు గకుండా బీఎన్‌రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి సహకారంతో ఏర్పాట్లను పూర్తి చేశాం. స్వామివారి కల్యాణాంతరం అన్నదానాన్ని కూడా నిర్వహిస్తాం. ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగుతాయి. ఈ జాతరకు మండలంలోనే మంచి గుర్తింపు ఉంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
- కంబాళ్లపల్లి ఉదయశ్రీ, సర్పంచ్ నందివనపర్తి
జాతర నిర్వాహణలో
భాగస్వామిగా ఉంటాం
శ్రీ నందీశ్వర ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సం వత్సరం అంగరంగ వైభవంగా జరు గుతాయి. ఈ నిర్వహణలో ప్రతి సంవత్సరం మేం భాగస్వామిగా ఉంటాం. చుట్టుపక్కల గ్రామాల ప్ర జలు వేల సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం వస్తారు. జాతర ఉత్సవాలకు సందర్భంగా కావాల్సిన కరెంటు సౌకర్యం, సౌండ్ సిస్టం, ఆలయానికి విద్యుత్తు అలంకరణ వంటి ఏర్పాట్లను చేస్తాం. ప్రతి సంవత్సరం శివపార్వతుల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. జాతర ఉత్సవాలకు వచ్చే వారికోసం అన్నదానం, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించే విధంగా చూస్తున్నాం.
- రాచర్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ యాచారం