Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకుల డిమాండ్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శివరాంపల్లి అర్జున్ బస్తీలో అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు స్తంభాల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాజేంద్రనగర్ మండల కన్వీనర్ కురుమయ్య, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక సమస్యల మీద పార్టీ నాయకులు శివరాంపల్లి బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్జున్ బస్తీలో కరెంటు స్తంభాలు ఒక ప్రణాళిక ప్రకారం వేయకపోవడంతో ఇండ్లపై పై కరెంటు వైర్లు ప్రమాదకరం గా మారాయని తెలిపారు. ఏదైనా ఘటన జరిగితే కరెంటు వైర్ ఇండ్లపై పడే అవకాశం ఉందన్నారు. దీంతో భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం ఈ కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు పుష్ప, అశోక్, భిక్షపతి, డేవిడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.