Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 250 మందికి పైగా హాజరైన ఔత్సాహికులు
- 73 ప్లాట్లు ఆన్లైన్ వేలానికి పెట్టిన హెచ్ఎండీఏ
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు సమీపంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న బాచుపల్లి హెచ్ఎండీఏ లే అవుట్లో ప్లాట్లను సొంతం చేసుకోవడానికి ఔత్సాహికు లు ఆసక్తి చూపుతున్నారని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. బాచుపల్లి లే అవుట్లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఉన్న తాధికారుల సమక్షంలో శుక్రవారం ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్టేట్ ఆఫీసర్ గంగా ధర్, హెచ్ఎండీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ) గంగాధ ర్, మల్కాజ్గిరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో) మల్లయ్య, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ప్రతినిధులు అనురాగ్, ధనుంజయ్ పాల్గొన్నారు. ప్రీ బిడ్ సమావేశంలో హెచ్ఎండీ అధికారులు లేఔట్ ప్రాధాన్య తను, వాటి పరిసరాల ప్రాముఖ్యతను గురించి వివరిం చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ప్రతినిధు లు అధికారులు ప్లాట్లలను ఆన్లైన్ పద్ధతిలో అనుసరిం చాల్సిన విధానాన్ని, నియమ నిబంధనలను గురించి వారికి వెల్లడించారు. బాచుపల్లి లేఔట్లో ఫ్లాట్ల సైజులు 266 చదరపు గజాల నుంచి 487 చదరపు గజాల వరకు గల ప్లాట్లు ఉండడం, అవి కూడా కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో రూ.25 వేలు (అప్ సెట్ ప్రైస్) ఉండడం విశేషమన్నారు.