Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవితం ఈసీజీ లాంటిది
- కష్టాలు వస్తూ, పోతూ ఉంటాయి
- పిల్లలకు సెల్ ఫోన్లు దూరంగా ఉంచండి
- వక్త సేవక్ కుమార్
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
ఆదివారం వికారాబాద్ మండలం జైదుపల్లి గ్రామంలో జీవితంలో విలువైన నేర్చుకోవడం ఉన్నతంగా బతకడం ఎలా అంశాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. జీవితం అనేది హాస్పిటల్లో ఉంటే ఈసీజీ లాంటి దని, ఈసీజీలో వచ్చే గీతలు కిందికి పైకి వెళ్తూ ఉంటేనే మనిషి బతికి ఉన్నట్లని, ఆ గీతలు లైన్‌గా వెళ్తే మనిషి మర ణించాడని అర్థమని, అలాగే జీవితంలో కష్టాలు సుఖాలు వస్తేనే జీవితం బాగుంటుందని లేకపోతే జీవితా నికి అర్థం లేదని వక్త సేవక్ కుమార్ అన్నారు. ఆదివారం వికారా బాద్ మండల పరిధిలోని జైదుపల్లిలో గ్రామ సర్పంచ్ ఎల్లమ్మ లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రజలకు జీవితంపై మొటి వేషనల్ క్లాస్ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా వక్త సేవక్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాలకు అనుగుణంగా శ్రమించాలని సూచించారు.యువతకు జీవితంపై క్లారిటీ లేకుండా పోతుందని, పేదవారికి పుట్టడం తప్పుకాదని, పేదవారిగా చావడం తప్పక తప్పే అని అన్నారు. పిల్లలకు జీవితం పై క్లారిటీ కావాలని, జీవితంలో వారు ఎం సాధించుకోవాలో వారికే వదిలి వేయాలని, తల్లిదండ్రులు బలవంతగా వారి లక్ష్యా లను రుద్దరాదన్నారు. జీవితంలో సక్సెస్ కాకపోవడానికి తల్లిదండ్రులే కారణమని, వారికి అవకాశాలు ఇవ్వాల న్నారు. 5 ఏండ్ల లోపు ఉన్న పిల్లల ను తమ తల్లిదండ్రులు మహారాజులుగా చూసుకోవాలని, ఆ వయసులో పిల్లలు అడిగిన ప్రతి దానిని తల్లిదండ్రులు సమకూర్చలని అలా చూసుకోకపోతే 25 ఏండ్ల తరువాత వారు సైకోగా మారే అవకాశం ఉందన్నారు. 6 సంవత్సరాలు నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలను క్రమశిక్షణ లో పెట్టాలన్నారు.16 ఏండ్ల లో పుపై ఉన్న పిల్లలను ఫ్రెండ్స్‌గా చూడాలని, తల్లిదం డ్రులను పిల్లలు ఇతరులతో పోతున్నారంటే, తల్లిదండ్రుల ప్రేమ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ రెండు వైపుల పదును గా ఉన్న కత్తిలాంటిదని ఎలా వాడు కుంటే అలా ఉందని మంచి కోసం మాత్రమే సెల్ ఫోన్స్ వాడాలన్నారు.యువత మంచి దారిలో నడవాలని, భాద, కోపం పడటం ద్వారా అడ్రినల్ రిలీజ్ అయ్యి గుండె పోటు బీపీ,షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది.ప్రజలు నవ్వ డమే మర్చిపోయారు. రైతులు కష్టాలు వచ్చి చచ్చిపోతే పట్టించుకునే నాధుడు లేదు. ఎవరైనా ధనికులు, రియల్ట ర్లు చచ్చిపోతే అందరూ వెళ్తారని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ , వార్డు సభ్యులు రాజు, యాదయ్య, అంబేద్కర్ సంఘం నా యకులు నాగేష్, రఘు, పెద్దలు గ్రా మస్తులు బ్రహ్మచారి, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.