Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధికారంలోకి రాగానే ఏక కాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ
- టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
- ముద్విన్ గ్రామంలో 'హాత్ సే హాత్ జోడో' యాత్ర
నవతెలంగాణ-ఆమనగల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనతో ఇబ్బందులు పడుతున్న జనం కోసం జనంలోకి వెళ్తున్నట్టు టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. కాంగ్రెస్ ప్రధాన నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కడ్తాల్ మండలం లో కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం పెంపొందిస్తుంది. ఆదివారం ముద్విన్ గ్రామంలో వందలాదిమంది కార్యకర్తలతో పార్టీ నాయకులు గడపగడపకూ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీపీసీసీ కార్యవ ర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కి కార్పోరేట్ కంపెనీల కొమ్ము కాయడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకోవడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల జీవన శైలి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలతో పాటు ఏకకా లంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. 17 ఏండ్ల కితం వర్షాల ధాటికి కొట్టుకుపోయిన ముద్విన్వాగు బ్రిడ్జిని పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ వైఫల్యాలను ఎండగట్టారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. కార్య క్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీక్యా నాయక్, మండల అధ్యక్షుడు యాటన ర్సింహ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేతావత్ హీరాసింగ్ నాయక్, ఎంపీటీసీ సభ్యులు పాల కుర్ల రాములు, జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు జహంగీర్ బాబా, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, మాజీ సర్పంచ్ యాదయ్య, నాయకులు రామకృష్ణ, మధు, నర్సింహ, వెంకటేష్, ప్రవీణ్, నరేష్, స్వామి, దశరథ్, సురేష్, పెద్దయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.