Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ మండల కన్వీనర్ పోచమొని కృష్ణ
నవతెలంగాణ-మంచాల
గ్రామ పంచాయితీ వేతనాలపై ఫ్రీజింగ్ ఎత్తివేసి వెంటనే వేతనాలు చెల్లించాలని సీఐటీయూ మండల కన్వీ నర్ పోచమోనీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆది వారం మండల పరిధిలోని జపాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది పాద యాత్ర గోడ పత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికులు ఎస్టీఓ ఫ్రీజింగ్ ఉండటంవల్ల 4 నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో కార్మికులు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామ పంచాయితీల్లో పాలక వర్గం చెక్కులు రాసి ఎస్టీఓకు పంపించిన చెక్కులు పాస్ కావడం లేదన్నారు. రేపు మండల కేంద్రంలో ధర్నా ఉం టుందని ప్రతి గ్రామ పంచాయితీ కార్మికులు పాల్గొని విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి దూసరి భాస్కర్, జిల్లా నాయకులు జపాల జగన్, జంగయ్య, రవి, యాదయ్య ఉన్నారు.