Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్
- ఘనంగా ఊరూరా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
- ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే శివాజీ విగ్రహాలు ఏర్పాటు
నవతెలంగాణ-పెద్దేముల్
ఛత్రపతి శివాజీ ఆలోచన విధానాలను యువత ఆచ రించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ సూచించారు. పెద్దేముల్ మండల కేం ద్రంతో పాటు జనగాం, గోట్లపల్లి తదితర గ్రామాల్లో ఛత్ర పతి శివాజీ 393వ, జయంతిని పురస్కరించుకుని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఛత్రపతి శివాజీ విగ్రహంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్య క్షులు కోహిర్ శ్రీనివాస్, ఛతపతి శివాజీ యువజన సం ఘం సీనియర్ నేత న్యాయవాది ఎల్లారెడ్డి మాట్లాడుతూ... శివాజీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, తన సైన్యంలో మూ డో వంతు ముస్లింలే ఉంటారన్నారు. శివాజీ అడుగుజాడ ల్లో నడవడం కాదు, సమాజంలో స్త్రీలను గౌరవించబడి నప్పుడే ఛత్రపతి శివాజీ ఆశయ సాధన నెరవేడుతుందన్నా రు. శివాజీకి నౌకాదళాధిపతిగా దౌలత్‌ఖాన్ ముస్లిం ఉన్నా డని గుర్తుచేశారు. తాండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో ప్రతి గ్రామంలో శివాజీ విగ్ర హాలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఛత్ర పతి శివాజీ యువజన సంఘం సభ్యులకు సహ కరించిన మండలాధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్‌ను యువజన సంఘం సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యువజన సంఘం అధ్యక్షులు నల్లా రవీందర్ రెడ్డి, (బంగ్లా రఘు) ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, ఆర్మీ రిటైర్డ్, మాజీ ఎంపీటీసీ విద్యాసాగర్, వార్డు సభ్యులు డీవై, అర వింద్, ఛత్రపతి శివాజీ యువజన సంఘం మీడియా కన్వీ నర్ డీవై ప్రసాద్, మాజీ వార్డు సభ్యులు మంబాపూర్ యా దయ్య, శివాజీ యువజన సంఘం సభ్యులు అశోక్, శ్రీధ ర్చారి, గేల్, రమేష్‌రెడ్డి, తరుణ్, కార్తీక్, శేఖర్, సంజీవరెడ్డి, శ్రీరామ్, నరసింహారెడ్డి, బాల్‌రెడ్డి యువకులు పాల్గొన్నారు.