Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ప్రశాంత్ ముదిరాజ్, దుర్గని శ్రీనివాస్
నవతెలంగాణ-షాద్ నగర్
కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీల కులగణన చేయాలని, మెజారిటీ వర్గమైన బీసీలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తుందని బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ప్రశాంత్ ముదిరాజ్, కొందుర్గు మండల అధ్యక్షులు దుర్గని శ్రీనివాస్ అన్నారు. షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండల లక్ష్మీదేవిపల్లి, చిన్న ఉమ్మెంత్యాల గ్రామాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని బీఎస్పీ ఆధ్వర్యంలో ఇంటిం టికీ తిరిగి సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 70 ఎమ్మెల్ల్యే సీట్లు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.50వేల కోట్లు బీసీలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రూ.రెండు లక్షల కోట్లు బీసీలకు కేటాయించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో నమ్మి బీసీలు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. గ్రామగ్రామాన తిరిగి బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీలను చైతన్యం చేసీ , బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీవీఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ తొండపల్లి దర్శన్, రేగడి చిలుక మరి సెక్టార్ అధ్యక్షులు ఉదరుకృష్ణ, కొందూర్గ్ సెక్టార్ అధ్యక్షులు గొర్లకాడి శ్రీనివాస్, చిన్న ఉమ్మేంత్యాల్ గ్రామ అధ్యక్షులు నర్సింలు, శ్రీకాంత్ పాల్గొన్నారు.