Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
చేవెళ్ల శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి వారి దోపోత్సవం కన్నుల పండుగగా సాగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి దోపోత్సవం ఘనంగా నిర్వహించారు. దోపోత్సవాన్ని దేవాలయ ప్రాంగణం నుంచి స్వామివారి పుష్కరిణి వరకూ ఊరేగింపు కార్యక్రమంలో డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా అలివేలు మంగమ్మను కూడా పుష్కరిణి వరకు తీసుకువచ్చారు. అనంతరం చెంచు వారు ఆటపాటల మధ్య స్వామివారి ఆభరణాలను దోచుకోవడం జరిగింది. దోపోత్సవం తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య దోపోత్సవం తిలకించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చేవెళ్ల సిఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఎస్ఐలు ప్రదీప్, అయుమ్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, సర్పంచ్ శైలజారెడ్డి, చేవెళ్ల పీఎసీఎస్ చైర్మెన్ దేవర వెంకట్రెడ్డి, దేవస్థానం ఈఓ శ్రీనివాస్, పూజారులు శ్రీపాద పంతులు, వివిధ గ్రామాల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.