Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమకారులకు ప్రభుత్వం కొండంత అండ
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
తెలంగాణ అమర వీరుడు సిరిపురం యాదయ్య త్యాగాలను మరువలేమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిరిపురం యాదయ్య 13వ వర్థంతి సందర్భంగా మహేశ్వరం గేటు దగ్గర యాదయ్య విగ్రహాన్ని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్‌తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య విద్యార్థి దశలోనే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాకారులకు, అమరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్ష మేరకు నీళ్లు, నిధులు, నియామకాలు జరిగే విధంగా పాలనను అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపి, చేపలు పెంచడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ 'రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. హైదరాబాద్ నడిబొడ్డున 12 ఎకరాలలో ఉద్యమాకారుల స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్నారని తెలిపారు. సంక్షేమ పాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, సహకార బ్యాంకు చైర్మన్ మంచి పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, కందుకూరు, బీఆర్ఎస్ మహేశ్వరం మండల అధ్యక్షులు అంగోతు రాజునాయక్, మన్నె జయేందర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు హనుమగల్ల చంద్రయ్య, లక్ష్మినర్సింహరెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ అద్యక్షుడు జల్లెల లక్ష్మయ్య, యూత్ అద్యక్షుడు సామెల్ రాజు, ఆర్కేపురం అధ్యక్షుడు నాగేశ్ వివిద గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఉద్యమకారులు పాల్గొన్నారు.