Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రటి ఎండలో పది కిలోమీటర్ల పాదయాత్ర
- మంచాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు నడిచిన కార్మికులు
- ఇబ్రహీంపట్నం ఎస్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా
- పంచాయతీ సిబ్బంది వేతనాలపై ఫ్రీజింగ్ ఎత్తివేయాలి
- సీఐటీయూ జిల్లా నాయకులు పోచమోని కృష్ణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో పంచాయతీ కార్మికులు ఆందోళన పూనుకున్నా రు. సుమారు పది కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఎస్టీఓ కార్యా లయం ఎదుట నిరసనకు దిగారు. గ్రామపంచాయతీ ఉ ద్యోగ, కార్మికుల వేతనాలపై ప్రభుత్వం విధించిన ప్రీజీంగ్ని ఎత్తివేసి వెంటనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచాల మండలానికి చెందిన పంచాయతీ కార్మికులు తమకు వేతనాలు రాకపోవడంతో సీఐటీయూ ఆధ్వర్యంలో మంచాల మండల కేంద్రం నుంచి ఇబ్రహీంపట్నం ఎస్టీఓ కార్యాలయం వరకు సుమారు పది కిలోమీటర్ల మేర పాద యాత్రగా వచ్చారు. వయస్సు మీద పడుతున్న కార్మికులు సైతం ఎర్రటి ఎండలు లెక్కచేయకుండా మంచాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు కాలినడకన వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని ఎస్టీఓ కార్యాల యం ఎదుట కూర్చుని నిరసన కొనసాగించారు. ప్రభుత్వం తమకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తుందని మండి పడ్డారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్టీవోకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు పోచమోని కృష్ణ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుల వేతనాలపై పెట్టిన ప్రీజీంగ్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రోజంతా పని చేస్తూ అతి తక్కువ వేత నాలు తీసుకుంటున్న వారు పంచాయతీ కార్మికులేనన్నారు. వెంటనే వేతనాలు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. ప్రీజీంగ్ ఎత్తివేసి వేతనాలు ఇవ్వకపోతే జిల్లా కలెక్టర్, జిల్లా ట్రెజరీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో యూనియన్ అధ్యక్షులు ఖాజా పాషా, జిల్లా నాయకులు జంగయ్య, రవి, దాసు, చెన్నయ్య, శంకర్, యా దయ్య, సురేశ్ ప్రభాకర్, హరి, వెంకట య్య, నర్సింహ, సుజాత, నర్సమ్మ, లక్ష్మి, బాలమాని, సుగుణ పాల్గొన్నారు.