Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
24న గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్ర జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా సీఐటీయూ ముఖ్య నేతల సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు మహిపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు.. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నా రు. కేరళ తరహాలో తెలంగాణలో కార్మిక చట్టాలు తెలంగా ణలో అమలు చేయాలన్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలన్నా రు. కార్మికులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఇవ్వాల న్నారు. కొత్తగాడి నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే పాద యాత్రలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, శ్రీనివాస్, నర్సమ్మ, చంద్రయ్య, కార్మికులు పాల్గొన్నారు.