Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
అసంఘటిత రంగ కార్మికులందరినీ ఈ-శ్రామ్ పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకు నేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారుల తో నిర్వహించారు. ఈ సమావేశంలో అయన మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మి కులకు ఈ-శ్రామ్ పోర్టల్ ద్వారా నమోదైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రమాద వశాత్తు మృతి చెందితే వారి కుటుంబానికి రెండు లక్షల బీమా కల్పిస్తామన్నారు. జిల్లా లో ఇప్పటి వరకు 85 వేల కార్మికులు మాత్రమే పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని అన్నారు. మిగతా కార్మికులను కూడా నమో దు చేయాలని సూచించారు. ఇత ర వివరాలకు 9700112524 శ్రీనివాస్‌ను సంప్రదించా లని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్ఓ అశోక్‌కుమార్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్డీఓ కృష్ణన్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డీపీవో తరుణ్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.