Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇ. పట్నం బరిలో సీపీఐ(ఎం) ప్రజా పోరాటాలతో పునాది వేసిన గడ్డ
- పోటీ స్థానాలపై సీపీఐ(ఎం) కేంద్రీకరణ
- ఇబ్రహీంపట్నం స్థానంపై రాష్ట్ర పార్టీ కేంద్రీకరణ
- ప్రజా, కార్మిక పోరాటాలకు పదును
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై సీపీఐ(ఎం) రాష్ట్ర పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇక్కడ పోటీ చేసేందుకు పార్టీని సమాయతం చేస్తోంది. ఇప్పటికే ప్రజా పోరాటాలను ఉధృతం చేసింది. ఇండ్ల స్థలాలు, భూ పోరాటాలకు పదును పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) కేంద్రీకరించే స్థానాల్లో ఇబ్రహీంపట్నం ఒకటి కూడా కావడం అందుకు బలం చేకూరుస్తుంది. కాగా అధికార పార్టీతో ఎన్నికల పొత్తు ఉంటుందని, ఇప్పటికే పార్టీ ప్రకటించిన విషయం విధితమే. ఒకవేళ పోత్తు లేకపోయినా ఒంటరి పోరుకు కూడా సిద్ధమవుతోంది. అయితే అధికార పార్టీతో పొత్తు ఉంటే, మాత్రం ఇబ్రహీంపట్నం సీటును తప్పకుండా గెలిచే వీలుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇటీవల ఆ పార్టీ నిర్వహిస్తున్న పోరాటాలు సంకేతాలు గా కన్పిస్తున్నాయి. ఇండ్ల ్లస్థలాలు, ఉపాధిహామీ అమలు, భూ పోరాటాలు, రెవెన్యూ సమస్యలు, విద్యార్థి ఉద్యమాలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక ప్రజాపోరాటా లు సాగాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక మూడు చట్టాలను రద్దును నిరసిస్తూ బలమైన పోరాటాలు నిర్వహిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావాలంటే సీపీఐ(ఎం) వంటి పార్టీ మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడం అవసరమని ప్రజలు బావిస్తున్నారు. 2004లో విజయం సాధించిన తరువాత మొదటి సారిగా ఇబ్రహీంపట్నంలోని అన్ని గ్రామాలకు కృష్ణా జలాలు తాగు నీరుగా సరఫరా చేయాలని ఇబ్రహీంపట్నం నుండి చలో అసెంబ్లీ పేరుతో సుమారు 10వేల మందితో పాదయాత్ర నిర్వహించి కృష్ణా జలాలు సాధించారు. అదే విధంగా కందు కూర్, మంచాల, మహేశ్వరం మండలాల్లో ప్రభుత్వ జూని యర్ కళాశాలల సాధనలో సీపీఐ(ఎం) కృషి ఆమోగం. 2009కి ముందు వరకు ఎస్సీగా ఉన్న ఇబ్రహీంపట్నం ని యోజకవర్గం నుంచి కందుకూర్, మహేశ్వరం మండలాలు విడిపోయి హయత్‌నగర్ మండలం కలిసింది. అప్పుడు ఐదు మండలాల్లో ఓటర్ల సంఖ్య 1,89,964 ఉండగా, ప్రస్తుతం నాలుగు మండలాలే. ఈ నియోజకవర్గంలో 2,57,711 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో వామప క్షాలు, టీడీపీ కూటమిలో టీడీపీకి కేటాయించారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు బలపర్చిన టీడీపీ అభ్యర్థిగా మంచి రెడ్డి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. అటు నుంచి 2014 కూడా కిషన్‌రెడ్డి విజయం సాధించగా, 2015లో టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 72,581 ఓట్లు సాధించారు. ఆయన సమీప ప్ర త్యర్థి బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి 72,205 ఓట్లు సాధించి స్వల్ఫ తేడాతో ఓడిపోయారు. కాగా సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటంలో అన్ని పార్టీలు పోటీకి సన్నధమవుతున్నాయి.
ఇబ్రహీంపట్నంలో పోరు తీరుతెన్నులు..
1957 నుంచి 1987 వరకు వరుసగా మూడు పర్యాయాలు కాం గ్రెస్ అభ్యర్థి ఎన్నికయ్యారు. తరువాత మూడు పర్యాయాలు మార్స్కిస్టులు ఆధిక్యత సాధించారు. నియోజక వర్గ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమైంది. అందులో రెండు సార్లు సీపీఐ(ఎం) నుంచి కొండిగారి రా ములు విజయం సాధించగా, మూడుసారి మస్కు నర్సింహా విజయ దుందుభి మోగించారు. 1957 నుంచి 1987 వరకు కాం గ్రెస్ అభ్యర్థి ఎంఎన్ఎన్ నర్సయ్య ఎమ్మెల్యేగా సారథ్యం వహించారు. ఇప్పటి వరకు జనరల్‌గా ఉన్న ఈ స్థానాన్ని 1952 నుంచి ఎస్సీ రిజర్వుగా కేటాయించారు. ఈ ఎన్ని కల్లో పీడీఎఫ్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. తరువాత కమ్యూనిస్టులు రెండు పర్యాయా లు ఏకదాటిగా విజయం సాధించారు. 1952 నుంచి 1983 వరకు కాంగ్రె స్ తిరుగు లేని విధంగా ఆధిక్యత చేెలాయించినప్పటికీ 1985లో పట్టు కోల్పోయింది. 1985 ఎన్నికల్లో టీడీపీ, 1989 ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీల అభ్య ర్థులు విజయం సాధించారు. 198 3 విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఏజీ కృష్ణ 1989 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఇబ్రహీం పట్నం స్థానాన్ని 1978 నుంచి 1989 వరకు ఎస్సీలకు రిజర్వు చేశారు. 6.4.1981న జరిగిన ఉప ఎన్నికల్లో కాం గ్రెస్ అభ్యర్థి ఏజీ కృష్ణ ఎన్నికయ్యారు. తరువా త జరిగిన సాధారణ ఎన్నికల్లో 1989 వరకు మార్క్సిస్టులు విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో టీడీపీ పుష్పలీల, కాంగ్రెస్ అ భ్యర్థి ఏజీ కృష్ణపై విజయం సాదించారు. 2004 ఎన్నికల్లో మరోసారి సీపీఐ(ఎం) మస్కు నర్సింహా, టీడీపీ అభ్యర్థి నర్రా రవికుమార్‌పై విజ యబావుట ఎగరేశారు. ఇప్పటి వరకు ఎస్సీగా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనతో 2009 లో జనరల్‌గా మారింది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్‌రెడ్డి విజయం సాధించారు. ఇక 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విజయం సాధించారు.
పోరాటాలకు పదును...
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజా పోరాటాలకు సీపీఐ(ఎం) పదును పెట్టింది. ఇండ్ల స్థలాల కోసం అబ్ధుల్లా పూర్మెట్, ఇబ్రహీంపట్నం మండలాల్లో పేదలు ప్రభుత్వం భూ ఆక్రమణలు చేస్తున్నారు. గతంలో ఇచ్చిన ఇండ్ల స్థలాల పట్టాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అబ్ధుల్లాపూ ర్మెట్ మండల పరిధిలో ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో జరిగిన ఇండ్ల పోరాటంపై ప్రభుత్వం నిర్బంధం విధిస్తుంది. గుడిసెలను తొలగిస్తుంది. ఇక ఇబ్రహీంపట్నం మండలం లోని రామోజీ ఫిలింసిటీలో రాయపోల్, పోల్కంపల్లి, నాయినంపల్లి, ముకునూర్ గ్రామాల పేదలు మరోసారి భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. తమకు కేటాయించిన ఇండ్ల స్థలాల్లోనే ఇండ్లను నిర్మించుకుంటామంటున్నారు. ఇక దండుమైలారం గ్రామ అనుబంధమైన హఫీజ్‌పూర్ రెవెన్యూలో పేదలకు 1972-73లో జారీ చేసిన అసైన్ పట్టాలకు హక్కులు కల్పించాలి ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇక సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక హక్కుల పరిరక్షణకు విస్తృత పోరాటాలు సాగుతున్నాయి. అంగన్వాడీ, ఆశావ ర్కర్లు, పంచాయతీ, మున్సిపల్ కార్మికుల పోరాటాలు ఉధృ తమవుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర స్థాయిలో బీఆర్ ఎస్, వామపక్షాల మధ్య కుదిరే ఒప్పందం మేరకు ఇబ్రహీం పట్నం సీటు తమకే వస్తుందని సీపీఐ(ఎం) శ్రేణులు ఉండగా, తామే పోటీ చేస్తామని బీఆర్ఎస్ శ్రేణులున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోత్తులు, ఎత్తులు ఏ విధంగా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే.