Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
ఇటీవల శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముది రాజుని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాస నమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజును, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలను శాలువాతో సన్మానించి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన బండ ప్రకాష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులకు సముచిత స్థానం కల్పించి గౌరవిస్తున్న సీంఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజులకు సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కొడంగల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నరసింహులు, జడ్పీటీసీ కోట్ల మహి పాల్ ముదిరాజ్, యువజన విభాగం అధ్యక్షులు బాల్‌రాజ్ ముదిరాజ్, బోంరాస్పేట్ మండలాధ్యక్షులు తిరుపతయ్య, దౌల్తాబాద్ మండలాధ్యక్షుడు ఆశన్న, అధికార ప్రతినిధి ఆంజనేయులు, కోస్గి కౌన్సిలర్ శ్రీనివాస్, కొడంగల్ మం డల యూత్ అధ్యక్షులు మల్లేష్, మాజీ సర్పంచ్ సంతోష్, దౌల్తాబాద్ యూత్ అధ్యక్షులు నరేందర్, మధు, కృష్ణ, వెంకటేష్, వికాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.