Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
- ఆత్మగౌరవం, హక్కుల సాధనకు ఉద్యమించాలి
- ఘనంగా ఎన్పీఆర్డీ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ-కొడంగల్
రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5 శాతం నిధులు కేటాయించాలనీ, విద్యా ఉద్యో గాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని వికలాం గుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జిల్లా అధ్యక్షులు దశరథ్ డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ ఏర్పడి 13 ఏండ్లయిన సందర్భంగా కొడంగల్లో ఎన్పీఆర్డీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు దశరథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 2010 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఆత్మగౌరం, హక్కుల సాధన లక్ష్యాలతో కోల్కత్తా పట్టణం లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం ఏర్పడిం దని తెలిపారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేసి 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టా న్ని సాధించామన్నారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వే షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వికలాంగులందరికీ ఒకే గుర్తింపు కార్డు కావాలని పోరాడి యూడీఐడీ కార్డులను ఇప్పించామని తెలి పారు. రైల్వేలో సౌకర్యాలు కల్పించాలని ఉద్యమాలు కొనసాగిస్తున్నా మ న్నారు. వికలాంగులపై జరుగుతున్న వేధింపులను అరికట్ట డానికి ప్రత్యేక రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేశారు. 21 రకాల వైకల్యాలను కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 7 రకాల వైకల్యాల వారికే ధ్రువీకరణ పత్రాల ను మంజూరు చేస్తున్నదని విమర్శించారు. తీవ్ర వైక ల్యం కలిగిన వికలాంగులకు వారి సహాయకులకు ప్రత్యేక సౌక ర్యాలు కల్పించాలని 2016 వికలాంగుల చట్టంలో ఉన్న ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాప న చేస్తున్నదన్నారు. వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలనీ, పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చే యాలనీ, ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రం ఏర్పాటు చే యాలని డిమాండ్ చేశారు. వికలాంగులపై జరుగుతున్న అవమానాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా హక్కుల సాధ నకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సావిత్రమ్మ, కొడంగల్ మండల కార్యదర్శి మారుతి తదితరులు పాల్గొన్నారు.