Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రావు జంగయ్య
నవతెలంగాణ-మంచాల
ప్రతి ఒక్కరూ అమరుల పోరాటాలు, జీవిత చరిత్రలు తెలుసుకునేందుకు పుస్తకాలు చదువుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రావు జంగయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కామ్రేడ్ కృష్ణ మూర్తిభవన్లో రెడ్ బుక్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పార్టీ నాయకుల జీవిత చరిత్రలు, పోరాటాలు,సాధించిన విజయాలపై రచించిన పుస్తకాలు చదవాలని సూచించారు.పుస్తకాలు చదవడంతోనే గత పోరాటాల స్ఫూర్తిని తెలుసుకుంటామనీ, అవి భవిష్యత్ ఉద్యమాలకు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సిలివేరు రాజు, కేవీపీఎస్ మండలాధ్యక్షులు గడ్డం యాదగిరి, డీవైఎఫ్ఐ మండలాధ్యక్షులు దేవరకొండ రామకృష్ణ, రైతు సంఘం నాయకులు బుర్రి సుధాకర్, నీళ్ల యాదయ్య, డీవైఎఫ్ఐ నాయకులు పగడాల ప్రహ్లాద్, ఒగ్గు ప్రభాకర్, అరుణ్, సాయి రామ్ తదితరులు ఉన్నారు.