Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రామస్వామి
- ఎనిమిదో రోజుకు చేరుకున్న భూ పోరాటం
నవతెలంగాణ-చేవెళ్ల
ప్రతి పేదవాడికీ పట్టాలు ఇచ్చే వరూ సీపీఐ పోరాడుతోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటం మంగళవారం 8వ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్ల పట్టాలి చ్చేంత వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. గతంలో కూడా చేవెళ్ల పట్టణ కేంద్రంలో 200 మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని పోరాడి సాధించిన ఘనత సీపీఐకే దుక్కుతోందన్నారు. అదే విధంగా ఇక్కడ కూడా పోరాడి ఇండ్ల పట్టాలు సాధిం చుకుంటామని తెలిపారు. పేదల పక్షాన నిలబడి, వారికోసం జైల్‌కు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏం ప్రభులింగం, రాష్ట్రకౌన్సిల్ సభ్యులు సుధాకర్‌గౌడ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్య నారాయణ, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు జె. అంజయ్య,పార్టీ మండల కార్యదర్శి సత్తిరెడ్డి, షాబాద్ మండల కార్యదర్శి జంగయ్య, రుక్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మల్లేష్, గీత పనివాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్, రాములుగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి శివయ్య, మండల మహిళా సంఘం అధ్యక్షు రాలు మంజుల, విజయమ్మ, సాయిలమ్మ పాల్గొన్నారు.