Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బి.మధుసూదన్ రెడ్డి
- యాచారంలో రెడ్ బుక్ డే
నవతెలంగాణ-యాచారం
కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంపైన దాడిని పూనుకుంటుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం యాచారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యా లయంలో ' రెడ్ బుక్ డే' పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ యుక్త వయసులోనే దేశం కోసం ప్రాణాలను అర్పించాలని గుర్తు చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం దేశ సంపదలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. దేశంలో కుబేరుడు ఆదాని ఆస్తుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి భాగస్వామ్యం ఉందని నేషనల్ మీడియా వెల్లడించిందని తెలిపారు. పేదలు పనిచేసే ఉపాధి హామీ చట్టం పైన కేంద్ర ప్రభు త్వం నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులపైన దాడులకు పాల్పడి హత్యాకాండలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా దేశ ప్రజలంతా పునరాలోచించి వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని గద్దె దించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, నాయకులు పి.అంజయ్య, ఆలంపల్లి జంగయ్య, సర్పంచ్ మండల బాషయ్య, అమీర్పేట మల్లేష్, మస్కు అరుణ, తదితరులు పాల్గొన్నారు.