Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎన్నికల నోడ ల్ ఆఫీసర్లతో బుధవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి టెలికాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఓటరు ఐడీ కార్డుల అనుసంధానం వెంటనే అప్డేట్ చేయాలని అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వారిగా ప్రభుత్వ, ప్రయివేటు ఉపాధ్యాయుల ఓటర్ల వివ రాలను వెంటనే తెలపాలని ఆదేశించారు. తహసీల్దా ర్లను తమ మండల పరిధిలో ఎంసీసీ టీం లీడర్లుగా ఎంపిక చేశామని, ఎన్నికల ప్రవర్తన నియమా వళి నిబంధనలకు విరుద్ధంగా ఉల్లం ఘనాలు జరగకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో 17 మండలాల్లో 18 పోలింగ్ కేంద్రా లను ఏర్పాటు చేశామని, వికారాబాద్లో 2 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యంగా విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లతో పాటు ర్యాంపులు, అవసరమైన ఫర్నిచర్, ఫ్యాన్లు పోలింగ్ కేంద్రానికి సంబం ధించిన తలుపులు కిటికీలు బాగుండేలా చూసుకోవాలన్నారు.