Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి
- జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
వతెలంగాణ-పరిగి
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను కఠి నంగా శిక్షించాలని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. బుధ వారం పరిగి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, బహు జన్ ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యా నాయక్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని యాలాల మండల పరిధిలోని పెర్కంపల్లి తండాలో పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినిపై లైంగికదాడిక పాల్పడిన సర్పంచ్ తమ్ముడు రఘుపతిని, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటస్వామి, క్లాస్ టీచర్ కృష్ణకుమార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన ప్రధాన ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని కోరారు. 'కంచే చేను మేసింది' అన్న చందంగా బోధించే ఉపాధ్యా యులే విద్యార్థులకు రక్షణ కల్పించకపోతే మరెవరు కల్పి స్తారనీ ప్రశ్నించారు. లైంగిక దాడికి గురైన విద్యార్థిని ప్రభు త్వ ఆదుకోవాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయా లని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఈ దుర్ఘటనకు పాల్పడిన నిందితు లను కఠినంగా శిక్షించాలని లేనియెడల రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. కార్యక్రమంలో అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.