Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు
- అభివృద్ధితోపాటు శాంతిభద్రతలూ
- ప్రజా ప్రతినిధులకు ముఖ్యం
- మనోభావాలకు ఆటంకం కలిగించి దాడులకు పాల్పడితే కేసులు ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-మర్పల్లి
శాంతి భద్రతలే తమ లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని కొత్లపురంలో సర్పంచ్ ప్రభాకర్, కోట్మర్పల్లిలో సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్యలతో కలిసి బుధవారం46 సీసీ కెమె రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మర్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో శాంతి భద్రతలతో పాటు నేరాలను అరికట్టేందుకు దోహదపడు తుందన్నారు. గ్రామాల్లో మహిళలకు, విద్యార్థులకు, అమా యకులకు, ప్రజా ప్రతినిధులకు కొందరితో పలు ఇబ్బం దులు ఎదురవుతాయని, వాటితోపాటు దొంగతనాలు, వం టి వాటిపై సీసీ కెమెరాలతో రాత్రీపగలు అనకుండా నిరం తరం నిఘా ఉంటుందన్నారు. సీసీ కెమెరాలతో అసలు నిందితులను పట్టుకునే అవకాశాలున్నాయన్నారు. ప్రజా ప్రతినిధులకు అభివృద్ధితో పాటు గ్రామాల్లో శాంతిభద్రత లూ ముఖ్యమన్నారు. ప్రతి గ్రామంలోనూ దాతల సహ కారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేరాలని యంత్రణకు సహకరించాలన్నారు. వ్యక్తుల మనోభావాల కు, దాడులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసు కుని కేసులు నమోదు చేస్తామన్నారు. మండలంలో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని వాటి నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశిం చారు. రోజురోజుకూ కల్తీ వస్తువుల అమ్మకాలు విపరీతం గా పెరిగాయని వాటిని నివారించేందుకు సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. మర్పల్లి ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మండలంలో ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తగుచర్యలు చేపడతామన్నారు. బిల్కల్లో 16, మర్పల్లిలో 20, కోట్మర్పల్లి లో21, సీసీ కెమెరాలతో పాటు సిరిపురం, కొత్లపురం, పట్లూర్, తుమ్మలపల్లి, భూ చన్పల్లి, షాపూర్తండా, గుర్రంగట్టుతండా, నర్సాపూర్ తండాలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని మిగతా గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాల న్నారు. జెడ్పీటీసీి మధుకర్ ప్రజా ప్రతినిధులతో కలిసి శాలువాతో ఎస్పీ కోటిరెడ్డిని సన్మానించారు. సీసీకెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు సహకరిస్తున్న జెడ్పీటీసీ మధుకర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, మై నార్టీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఖలీమోద్దీన్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాచన్న, సర్పంచ్ ప్రభాకర్, మండల యూత్ ప్రెసిడెంట్ మధుకర్, కొంషట్ పల్లి రఫీ, సిరిపురం సర్పంచ్ మల్లయ్య, తదితరులను ఎస్పీకోటిరెడ్డి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, మోమిన్పెట్ సీఐ వెంకటేశం, ఎస్ఐలు విజరుకుమార్, భరద్వాజ్ సహకార సంఘం డైరెక్టర్ యాదయ్య, నూరోద్దిన్, మండల నాయకులు గోపాల్ రెడ్డి, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.