Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ అనీల్ కుమార్
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
గొర్రెలకు, మేకలకు నట్టల మందులు వేయడం వల్ల అంతరపరాన్న జీవులు నశించి జీవాలు బాగా ఎదుగుతా యని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ అనీల్ కుమార్ అన్నారు. దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రా మంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో బుధవారం గొర్రె లకు, మేకలకు నట్టల మందును తాగించారు. 480 గొర్రె లు, 230 మేకలకు నట్టల మందు తాగించినట్లు వారు తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ జీవాలకు నట్టల మందు తాగించడం వల్ల వాటిలో ఉండే అంతరపరాన్న జీవుల నుంచి రక్షణ లభించి బాగా ఎదగ డంతో పాటుగా జీవాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. పశులను పెంచే ప్రతి రైతు తప్పనిసరిగా నట్టల మందును వేయించుకొని తమ జీవాలను రోగాల బారినుండి రక్షించు కోవాలని సూచించారు. జిల్లా ఏడి ప్రహ్లాద్, పరిగి ఏవో అంకమరాజు, పశువైద్యాధికారి ఆనంద్, సర్పంచ్ కోళ్ళ సురెష్, ఎంపీటీసీ రాములు, రామకృష్ణ, వైద్య సిబ్బంది బాబయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.