Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కుల్కచర్ల
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుం టున్నామని సర్పంచ్ సౌమ్య వెంకటరామిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్ల మండలం కేంద్రంలోని ఆముదాల గడ్డ పాఠశాల ఆవరణ లో విద్యార్థులకు తాగునీటి సమస్యపై స్పందించి నూతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. గ్రామంలో ఎక్కడైనా తాగునీటి సమస్య తండా ఎప్పటికప్పు డూ చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు బూట్లు తోడిగిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ సౌమ్య వెంకట్రామిరెడ్డి, గ్రామ కార్య దర్శి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు చేతుల బ్లౌజులు, బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేదని కొనియాడారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కార్మికులకు బూట్లను తోడిగారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు వెంకటేష్, కరోబార్ వెంకటయ్య, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.