Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాధికారిణి రేణుకా దేవి
నవతెలంగాణ-కుల్కచర్ల
రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యే క కృషి చేయాలని జిల్లా విద్యాధికారిణి రేణుకా దేవి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని బాలికల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో పలు విషయాలు చర్చించారు. అంతకుముందు పలు రికార్డులు, విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని అంశాల్లో రాణించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ హాబీబ్ అహ్మద్, గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్దేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.