Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
జిల్లాలో సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) నివేదికల్లో పెండింగ్‌లో ఉన్న ఆడిట్ పేరాలలో ఎలాంటి పొరపాట్లు జరగనట్లయితే, ఆ పేరాలను వెంటనే క్లియర్ చేయాలని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని తన కార్యాలయం నుండి డైరెక్టర్ హనుమంతరావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, డీఆర్డీఓ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాల వారి గా అన్ని గ్రామ పంచాయతీలలో పెండింగ్‌గా ఉన్న సో షల్ ఆడిట్ పేరాలను వెంటనే క్లియర్ చేయాలని, ఇందు లో ఏమైనా తప్పులు, అవకతవకలు జరిగినట్లయితే సం బంధిత సిబ్బందిపై తీవ్రచర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ విషయంలో కచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కార్యక్రమం లో డీఆర్డీఓ కృష్ణన్, అడిషనల్ పీడీలు నర్సింలు, సెవెన్ నీల్ తదితరులు పాల్గొన్నారు.