Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి కె. సుదర్శన్ మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ సిబి. షితాల్ ఆదేశాల మేరకు పరిగి సబ్ జైల్ ను సందర్శించిన జిల్లా లీగల్ సర్వీస్ అధికారులు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆదేశానుసారం పరిగి సబ్ జైలును సందర్శించి ఖైదీల బాగోగులు, ఆరోగ్య పరిస్థితి, తదితర అంశాల గురించి ఆరా తీశారు. ఏవరైన న్యాయవాది పెట్టు కొలేని సోమత లేని వారు తమ దష్టికి తెచ్చినట్లు అయితే వారికి జిల్లా న్యాయ సేవా సంస్థ తరుపున న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పరిగి న్యాయమూర్తి హరి కుమార్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చీఫ్ ఢిపెన్ష్ కౌన్సిల్ టి. వెంకటేష్, డిప్యూటీ కౌన్సిల్ పి.రాము మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.