Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల విద్యాధికారి హరిచందర్
నవతెలంగాణ-పరిగి
పదో తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మండల విద్యాధికారి హరిచందర్ అన్నారు. బుధవారం పరిగి పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. పాఠశాలలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రధానోపాధ్యాయులు అందరితో చర్చించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి హరిచందర్ మాట్లాడుతూ త్వరలోనే పదో తరగతి పరీక్షలు రాబోతున్నాయని తెలిపారు. మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 'మనఊరు-మనబడి' కింద ఎంపికైన పాఠశాలలో మౌలిక సదుపాయాలు 'మనఊరు-మనబడి' కింద నిధులు వస్తున్నందున పనులు అన్నిటిని పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.