Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాపన్నగారి మాణిక్ రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్
రాష్ట్ర ప్రభుత్వం చొరవతీసుకుని ఉపాధ్యాయుల బది లీలపై న్యాయ వివాదాన్ని పరిష్కరించి బదిలీలు, పదోన్న తులలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించాలని టీఎస్ యూ టీఎఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డి అన్నారు. బోంరాస్పేట్ మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల చౌదర్పల్లి, కేజీబీవీ చెట్టుపల్లి తండా, ఆశ్రమ పాఠశాల తుంకిమెట్ల, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల చిల్ముల్ మైలవరం, దుద్యాల యాజమాన్యాల పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ గురుకులాల పనివేళలు మార్చాలని, సంక్షేమ గురు కుల ఉపాధ్యాయులపై పనివత్తిడి తగ్గించాలని, హెల్త్కా ర్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయా ల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, ఎంసీఎపీ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. భాషాపండితులు, వ్యాయమ ఉపాధ్యాయులకు కూడా అం దరితోపాటే అప్గ్రేడ్ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పదోన్న తులు ఇవ్వాలని కోరారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి, నిబద్దతతో పోరా డుతానని ఉపాధ్యాయులు అందరూ మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రాములు, గౌరారం గోపాల్, రాజశేఖర్, బస ప్ప, ముత్యప్ప, జిల్లా కార్యదర్శి నడిమింటి మల్లేష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.