Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్. రాజునాయక్
నవతెలంగాణ-షాద్‌నగర్
నేటి యువత భగత్‌సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.రాజునాయక్ అన్నారు. బుధవారం సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి. శ్రీనునాయక్ ఆధ్వర్యంలో 'రెడ్ బుక్ డే 'కార్యక్రమం నిర్వహించి, భగత్ సింగ్ జీవిత చరిత్ర పుస్తక పఠనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని, ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా పోరాడిన మహావ్యక్తి షహీద్ భగత్ సింగ్ అని కొనియాడారు. ఒక శాస్రీయ ఆలోచనలను హేతువాద ఆచరణకు విరుద్ధంగా మూఢ విశ్వాసాలను, ఆచారాలను రాజ్యమే ప్రోత్సహిస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవిత చరిత్ర, ఆలోచనలు, అనుభవాలనూ చదవాలని సూచించారు. 2020లో రెడ్ బుక్ డే సందర్భంగా కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను ప్రపంచ వ్యాపితంగా సామూహిక పఠనం చేపట్టారని గుర్తు చేశారు. అనేక ప్రచురణ సంస్థలు తమ తమ భాషల్లో 'ప్రణాళిక'ను ముద్రించి ప్రజల్లోకి తీసుకెళ్లాయని తెలిపారు. కొంతమంది మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్న నేపథ్యంలో పౌరుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై ఆటంకాలను కల్పిస్తూ, హక్కులను కాలరాస్తున్న పరిస్థితిల్లో భగత్‌సింగ్ ఆలోచనల అధ్యయనం ప్రతి ఒక్కరినీ దిశా నిర్దేశం చేస్తుందన్నారు. భగత్‌సింగ్ జీవిత చరిత్ర చదివితే, ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాం, చైతన్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబు, ఈశ్వర్ నాయక్, చంద్రమౌళి, నర్సింలు, లక్ష్మి, చైతన్య, లలిత, మీది పేట రాజశేఖర్, శ్రీకాంత్, సాయి, రాములు, పాండు, హీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.