Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల, కొంగరకలాన్, పటేల్ గూడ, పోచారం, ఎలిమినేడు తదితర పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ముప్పై ఏండ్లుగా ఉపాధ్యాయ ఉద్యమాల్లో నిరంతరం పోరాటాలు చేస్తున్న ఎస్టీయూ అధికారిక అభ్యర్థి భుజంగరావుకు మొదటి ప్రాధాన్యతో ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయుల ఓట్లతో గెలిచి వారి సమస్యలను గాలికొదిలేసిన నేటి ఎమ్మెల్సీలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉపాధ్యాయుల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా డబ్బుల ఎరచూపి ఓట్లు వేయించుకోవడం అప్రజాసామ్యమన్నారు. భుజంగ రావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగానే కొనసాగుతారనీ, ఎస్టీయూ ఎమ్మెల్సీగా కాదని హామీనిచ్చారు. పండిట్, పీఈటీ పోస్టు లను అప్గ్రేడ్ చేయడంలో, చిత్తశుద్ధితో బదిలీలు పదో న్నతులు నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏ.వి.సుధాకర్, ఇబ్రహీంపట్నం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, తిరుమలేష్ , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, యాదగిరి, సభ్యులు పరమేశ, భాస్కర్ పాల్గొన్నారు.